కళ్యాణ్ రామ్ కొత్త సినిమా…??

వాస్తవం సినిమా: నందమూరి కళ్యాణ్ రామ్ ఒకపక్క సినిమాలు చేస్తూ మరో పక్క నిర్మాతగా సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు. ఇదిలా ఉండగా లాక్ డౌన్ తర్వాత చాలావరకు సినిమా షూటింగ్ లు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో…. కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ని ఓకే చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. పూర్తి విషయంలోకి వెళ్తే డైరెక్టర్ పవన్ సాదినేని ఇటీవల కళ్యాణ్ రామ్ కి స్టోరీ వినిపించటం జరిగిందట. అయితే సినిమా లైన్ మొత్తం నచ్చడంతో స్టోరీ గా రూపొందించి పూర్తి స్క్రిప్టు వినిపించిన తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాని తన బ్యానర్ లోనే నిర్మించడానికి కళ్యాణ్ రామ్ రెడీ అవుతున్నట్లు కూడా టాక్. ఇండస్ట్రీలో వెరైటీ కాన్సెప్ట్ లతో సినిమాలు తీసే పవన్ సాధినేని… ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లో సరికొత్త కోణాన్ని చూపించడానికి రెడీ అవుతున్నట్లు…. స్టోరీ కూడా అదే రీతిలో ఉండే రీతిగా ప్రస్తుతం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరోపక్క కళ్యాణ్ రామ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోయే 30వ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.