డార్లింగ్..అది కూడా కానిస్తే మేము బాగా సంతోషిస్తాం..అంటున్న ప్రభాస్ ఫాన్స్!

వాస్తవం సినిమా: “బాహుబలి” సినిమా తో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ సపరేటు గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్… ఇండియాలో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు. దీంతో ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మినిమం బడ్జెట్ 100 కోట్లు పైగా నే ఉంటున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బడా బడా నిర్మాతలు, దర్శకులు కూడా ప్రభాస్ తో సినిమా చేయడానికి “క్యూ” కట్టే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాదే శ్యాం, ఆది పురుష్…. అదే రీతిలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా ప్రభాస్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో రానా, నిఖిల్, నితిన్ లాంటి హీరోలు పెళ్లిళ్లు చేసుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రభాస్ పై సొంత ఫ్రెండ్స్ డార్లింగ్ పెళ్లి త్వరగా చేసుకో…. అది కూడా కానిస్తే మేము బాగా సంతోషిస్తాం అని తెగ కామెంట్లు పెడుతున్నారు. మరోపక్క ప్రభాస్ పెళ్లి గురించి గతంలో అనేక వార్తలు రాగా, ఇటీవల… ప్రభాస్ కుటుంబ సభ్యులు ఒకరు త్వరలోనే ప్రభాస్ పెళ్లి కూడా గ్యారెంటీ అని చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. మొత్తంమీద చూసుకుంటే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.