మరో హామీ నెరవేర్చిన ఏపీ సీఎం జగన్..!!

వాస్తవం ప్రతినిధి: అధికారంలోకి రావడంతోనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. ఏడాది పరిపాలనలోనే దాదాపు 90 శాతానికి పైగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని జగన్ నెరవేర్చి చాలా వరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

తాజాగా వైయస్సార్ ఆసరా పథకం ప్రారంభించడంతో పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పొదుపు సంఘాల మహిళలు అప్పులను నాలుగు దశల్లో తీర్చేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల పొదుపు సంఘాల మహిళలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటం జరిగింది.

ఈ సందర్భంగా లబ్ధిదారులు జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. అదేవిధంగా దిశ చట్టం, మద్యం నియంత్రణ విషయాలలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అభినందనీయమని ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మహిళలు ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.