ఆర్మీకి మంచి పౌష్టికాహారం ఇవ్వాలి అంటున్న రాహుల్ గాంధీ..!!

వాస్తవం ప్రతినిధి: దేశ ప్రజలను రక్షించడానికి బోర్డర్ లో ఎండనక వాననక కష్టపడుతున్న దేశ ఆర్మీ జవాన్లందరికీ పౌష్టికాహారం ఇవ్వాలి అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇటీవల రక్షణశాఖ కి సంబంధించిన స్టాండింగ్ కమిటీ మీటింగులో పాల్గొన్న నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్మీ జవాన్లకు తక్కువ స్థాయి పౌష్టిక ఆహారం ఇవ్వటం అంత మంచిది కాదని స్పష్టం చేశారు. సైనిక అధికారులతో పాటు సైనికులకు ఒకే రీతిలో పౌష్టికాహారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయంలో ఒకరికి ఒక లాగా, మరొకరికి మరొక లాగా…. ఫుడ్ పెడితే వివక్షత చూపించినట్లు అవుతుందని ఆయన అన్నారు. ఈ విషయంలో నిబంధనలు సవరించి అయినా జవాన్లకు మంచి ఫుడ్ అందించాలని సూచించారు. అసలే డ్రాగన్ కంట్రీ తో పరిస్థితి నువ్వానేనా అన్నట్టుగా ఉంది. ఇలాంటి తరుణంలో పక్షపాతం చూపించకూడదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.