ఆ సినిమా ఆగిపోలేదు… క్లారిటీ ఇచ్చిన బన్నీ డైరెక్టర్..!!

వాస్తవం సినిమా: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “అల వైకుంఠపురం లో” ఈ సినిమా విజయంతో అభిమానుల ఆకలిని ఒక్కసారిగా తేల్చేశాడు. నా పేరు సూర్య లాంటి దారుణమైన డిజాస్టర్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బన్నీ సరైన కథతో ఈ ఏడాది ప్రారంభంలో “అల వైకుంఠపురం లో” సినిమా తో సరికొత్త రికార్డులు సృష్టించాడు.

కాగా ఈ సినిమా చేస్తుండగానే బన్నీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమా ప్రాజెక్టు ఓకే చేయడం జరిగింది. దిల్రాజు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా వస్తున్నట్లు అప్పట్లో పోస్టర్ కూడా రిలీజ్ అయింది. అయితే ఆ తర్వాత కరోనా రావడంతో పరిస్థితులు మొత్తం మారటంతో ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటువంటి నేపథ్యంలో వేణు శ్రీరామ్ సినిమా పై వస్తున్న వార్తలను ఖండించారు .”ఐకాన్” సినిమా ఆగిపోలేదని….. ఖచ్చితంగా ఈ సినిమా బన్నీతో చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజేశారు.

ప్రస్తుతం వేణు శ్రీరామ్ ఫోకస్ అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సబ్ సినిమా పై ఉందట. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం గ్యారెంటీ అని పవన్ అభిమానులకు “వకీల్ సాబ్” ఫుల్ మీల్స్ సినిమా లాంటిదని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.