జగన్ పై జేపీ కీలక వ్యాఖ్యలు!

వాస్తవం ప్రతినిధి: లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ  ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంటారు. తాజాగా ఓ చానెల్లో జరిగిన చర్చలో ఆంద్రప్రదేశ్ లోని కొన్ని సమస్యలపై జయప్రకాష్ నారాయణ  కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సాహసోపేతంగా తీసుకుంటున్న పలు నిర్ణయాలను ఆయన బహిరంగంగా ప్రశంసించారు.

ప్రభుత్వ నిర్ణయాలలో కోర్టుల ప్రమేయం గురించి మాట్లాడుతూ “కోర్టులు తమ కర్తవ్యాన్ని చేయాలి. ప్రభుత్వాలు తమ పాలన విధులను నిర్వర్తించాలి. అయితే ఈ రోజుల్లో అవి డైవర్ట్ అవుతున్నాయని జేపీ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ఖండించడం సరైందే. కానీ ప్రభుత్వ విధాన విషయాలలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని పౌరులు కూడా అభిప్రాయపడుతున్నారన్నారు.