మళ్ళీ అదే హీరోయిన్ ని రిపీట్ చేస్తున్న బాలయ్య బాబు..!!

వాస్తవం సినిమా: వరస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబుతో ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ సినిమా చేస్తున్న నేపథ్యంలో నందమూరి అభిమానులు ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో పెట్టుకున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు క్రియేట్ చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అయితే గత కొంత కాలం నుండి బాలయ్య బాబు చేసుకున్న సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న తరుణంలో…. బోయపాటి దర్శకత్వంలో స్టార్ట్ అయిన మూడో సినిమా తో కచ్చితంగా హిట్ బాలయ్య కి పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కాగా ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ విషయంలో అనేక పేర్లు ఇప్పటికే వినబడ్డాయి. టాలీవుడ్ హీరోయిన్ అని ఇంకా కొంతమంది టాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ల పేర్లు సినిమాలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా గతంలో తనతో “డిక్టేటర్” సినిమా లో హీరోయిన్ గా చేసిన అంజలిని….బోయపాటి సినిమా లో రిపీట్ చేయడానికి బాలయ్య బాబు రెడీ అయినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో హీరో నవీన్ చంద్ర పొలిటికల్ లీడర్ క్యారెక్టర్ చేయనున్నట్లు టాక్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ బోయపాటి స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.