సోషల్ మీడియాలో అదరగొడుతున్నమహేష్ పిక్..!!

వాస్తవం సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగకు “సరిలేరు నీకెవ్వరు” సినిమా తో అదిరిపోయే విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయంతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మహేష్. ఆ తర్వాత కరోనా వైరస్ రావడంతో ఇండస్ట్రీలో షూటింగులు మొత్తం ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామంతో దాదాపు ఈ ఏడాదిలో కెమెరా ముందుకు రాని పరిస్థితి నెలకొంది. లాక్ డౌన్ సమయంలోనే తన తర్వాత సినిమా “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నట్లు మహేష్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వక ముందే ఒక యాడ్ కి సంబంధించిన షూటింగ్ లో మహేష్ జాయిన్ అవ్వడం జరిగింది. కాగా ఈ షూటింగ్ సమయంలో మహేష్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో తాజాగా రిలీజ్ అయింది. మహేష్ ను చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కాదు నువ్వు హాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండాల్సిన హీరో అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లాంగ్ హెయిర్ తో “అతిధి” సినిమాలో కంటే చాలా హ్యాండ్ సమ్ గా మహేష్ లుక్ ఉంది.