‘మనసు మమత’, ‘మౌనరాగం’ సీరియల్స్ నటి శ్రావణి ఆత్మహత్య !

వాస్తవం సినిమా: సీరియల్స్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది.ప్రస్తుతం ‘మనసు మమత’, ‘మౌనరాగం’ సీరియల్స్ లో శ్రావణి నటిస్తున్నట్లు తెలుస్తోంది.హైదరాబాద్‌ మధురానగర్‌లోని తన నివాసంలో మంగళవారం రాత్రి ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు..

శ్రావణి బాత్రూంలోకి వెళ్లి ఎంతకీ రాకపోవడంతో ఖంగారుపడిన కుటుంబ సభ్యులు డోర్ పగలగొట్టి చూడగా ఆమె ఊరికి వేలాడుతూ కనిపించారు. టిక్‌టాక్ ద్వారా ఇటీవల శ్రావణికి కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో పరిచయమైంది. స్నేహం కాస్తా ప్రేమకు దారితీసింది. తనకు తల్లిదండ్రులు లేరని చెప్పి శ్రావణికి మరింత దగ్గరయ్యాడు. డబ్బుల కోసం దేవరాజు వేధించేవాడని శ్రావణి కుటుంబ సభ్యులు తెలిపారు. అతడి వేధింపులు భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.

శ్రావణిని ప్రేమిస్తున్నట్టు నమ్మించి ఆమెతో సన్నిహితంగా ఉంటూ దేవరాజ్ ఫొటోలు తీసుకున్నాడని, తర్వాత ఆ ఫొటోలు బయటపెడతానంటూ డబ్బులు డిమాండ్ చేశాడని పేర్కొన్నారు. అతడి వేధింపుల తీవ్రం కావడంతో ఇటీవల ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో శ్రావణి ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు. అయినప్పటికీ వేధింపులు ఆపకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. శ్రావణి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్యకు కారణమైన దేవరాజ్‌ను కఠినంగా శిక్షించాలని శ్రావణి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.