నెల్లూరు లో దారుణం..ఆసుపత్రిలో కరోనా బాదితురాలి ఆత్మహత్య!

వాస్తవం ప్రతినిధి: నెల్లూరులోని జిజిహెచ్ లో దారుణ౦ జరిగింది. కోవిడ్ హాస్పిటల్ లో గుర్తింపు పొందిన జీజీహెచ్ లో మూలాపేట కి చెందిన పరమేశ్వరమ్మ అనే కరోనా బాధితురాలు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కరోనా బారినపడ్డ పరమేశ్వరమ్మ కు వాంతులు తగ్గకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని అక్కడ డాక్టర్లు చెబుతున్నారు. కరోనా బాధితురాలు వైద్యం అందించే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో ఆత్మహత్య చేసుకోవడం చూసేవారిని కలచివేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.