మహేష్ ఫ్యాన్స్ విజిల్స్ వేసే న్యూస్..!!

వాస్తవం సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు ఇలా మూడు సినిమాలతో బ్లాక్ బస్టర్ లు సాధించి బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించడం జరిగింది. ప్రస్తుతం గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేయడానికి మహేష్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమా అయిన వెంటనే మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు తాజాగా ఫిల్మ్ నగర్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మామూలుగా అయితే సర్కారు వారి పాట సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేయాలని మహేష్ అనుకున్నారట. కానీ రాజమౌళి ‘RRR’ సినిమా ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో…. సర్కారు వారి పాట అతి తక్కువ టైమ్ లోనే కంప్లీట్ చేయడం గ్యారెంటీ కావడంతో, ఆ తర్వాత వెంటనే త్రివిక్రమ్ తో మహేష్ సినిమా చేయనున్నట్లు టాక్. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు విని విజిల్స్ వేస్తున్నారు. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా మహేష్ నటనలో చాలా మెచ్యూరిటీ లెవల్స్ సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చాయి. అటువంటిది మరోసారి ఈ కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.