“వి” మూవీ రివ్యూ..!!

కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూత పడిన తర్వాత డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలైన తొలి భారీ తెలుగు సినిమా “వి”. నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో మల్టీ స్టారర్ గా రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5న రిలీజ్ అయింది. ఇండస్ట్రీలో చాలా డిఫరెంట్ గా సినిమాలు తీసే డైరెక్టర్ గా ఇంద్రగంటి మోహన్ కృష్ణ పేరు ఎప్పుడూ వినబడుతూనే ఉంటుంది. గ్రహణం, అష్టా చమ్మా ఇంకా చాలా సినిమాలు డిఫరెంట్ కథాంశం విలక్షణమైన పాత్ర లతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటారు. అయితే ఇక తాజా సినిమా “వి” విషయానికొస్తే ఎప్పుడూ ఒకేలా కాకుండా మరింత డిఫరెంట్ గా రూటు మార్చి సినిమా చేశారన్న భావన ఏర్పడుతుంది. మరి మోహన్ కృష్ణ టేకింగ్ కి నాని సుధీర్ బాబు ఏ మేరకు న్యాయం చేశారో ఒకసారి తెలుసుకుందాం.

కథా కథనం విశ్లేషణ:-

సినిమా విషయానికి వస్తే ఒక ఇంటెలిజెంట్ కిల్లర్ కి ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ మధ్య నడిచే స్టోరీ అని చెప్పవచ్చు. డీసీపీ ఆదిత్య హైదరాబాద్ లో పవర్ ఫుల్ అండ్ చాలా సిన్సియర్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న పోలీస్ ఆఫీసర్. ఈ క్రమంలో రచయితగా మారిన అపూర్వ తో ప్రేమలో పడతాడు. జీవితం సాఫీగా సాగిపోతుంది అని అనుకుంటున్న సమయంలో…. ఊహించని విధంగా ఓ క్రిమినల్ జీవితంలోకి ప్రవేశిస్తాడు. నగరంలో వరుస హత్యలు చేస్తూ ఆదిత్య కి ఓ చాలెంజ్ గా మారతాడు. త్వరలో ఐదు హత్యలు చేస్తానని చెప్పి మరీ సవాల్ విసిరి పోలీస్ డిపార్ట్మెంట్ కి చాలెంజ్ గా మారుతాడు. అయితే ఈ క్రిమినల్ డిసిపి ఆదిత్య ని టార్గెట్ గా చేసుకుని హత్య చేయడం ఎందుకు మొదలు పెట్టాడు ?…. అసలు ఆ క్రిమినల్ ఆ అయిదుగురిని ఎందుకు హత్య చేయాలనుకుంటున్నాడు? ఈ విషయంలో పోలీస్ ఆఫీసర్ ఆదిత్య ఎలా పరిష్కరించాడు? చివరాఖరికి అపూర్వ ఆదిత్య ప్రేమ కథ ఎలా సాగింది ? అసలు ఈ కిల్లర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అసలు ఈ కిల్లర్ ని ఆదిత్య చివరాకరికి పట్టుకుంటాడా? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి అంటే సినిమాని ఓ టి టి లో వీక్షించాల్సిందే.

సినిమా విశ్లేషణ:-

స్టోరీ పరంగా ఇంద్రగంటి కృష్ణ కథ చాలా వరకు న్యాయం చేశాడు. ఆ కథలో ఆయన సృష్టించిన కిల్లర్, పోలీస్ ఆఫీసర్ పాత్రలు సినిమాకి చాలా బలంగా ఉన్నాయి. ఓ పబ్ పార్టీలో ఆదిత్య అపూర్వ కలుసుకోవడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ప్రసాద్ హత్యతో మూవీ…. అసలు కథలోకి ప్రేక్షకుని తీసుకెళ్తుంది. క్రిమినల్ ఎంట్రీతో సినిమా లో జోష్ పెరుగుతోంది. ఆదిత్య అపూర్వ మధ్య సన్నివేశాలు రొమాంటిక్ గా ఉంటే, పోలీస్ ఆఫీసర్ క్రిమినల్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. సెకండ్ హాఫ్ లో కథ చాలా ట్విస్టులతో సాగుతోంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో ఆసక్తి గా చూపించిన సెకండాఫ్ లో ఆ జోష్ లేదు. సెకండాఫ్ కూడా ఆసక్తిగా చూపించి ఉంటే సినిమా మరోలా ఉండేది. నటీనటుల విషయానికి వస్తే నాని క్యారెక్టర్ లో చాలా వేరియేషన్ లు కనిపిస్తాయి. ప్రతి వేరియేషన్ ని తన న్యాచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పిస్తాడు. లవర్ గా, ఆర్మీ ఆఫీసర్ గా చివరకు క్రిమినల్ గా, ఫ్రెండ్ గా కూడా తన పెర్ఫార్మెన్స్ తో ఇరగదీస్తాడు. సుధీర్ బాబు ఫస్టా ఫ్ లో యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. నివేద థామస్ చిలిపి గా కనిపిస్తూ…. పాత్రలో ఒదిగిపోయింది.

సాంకేతిక విషయానికొస్తే:-

డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ తన అభిరుచికి భిన్నంగా ప్రయత్నించడం కొత్తగా అనిపిస్తుంది. మొదటి భాగంలో స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్ గా రాసుకోవడం సినిమాకి బలం గా మారింది. సీరియస్ మైండ్ గేమ్ గా చూపించే సినిమా కాబట్టి కామెడీకి పెద్దగా డైరెక్టర్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కాకపోతే నాని పాత్రతోనే ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం డైరెక్టర్ చేశారు. తమన్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపించింది. అదేవిధంగా నిర్మాత దిల్ రాజు అద్భుతరీతిలో సినిమాలో నిర్మాణ విలువలు ఉండేలా 100% న్యాయం చేసారు.

మొత్తంగా చూసుకుంటే:-

నాని, సుధీర్ బాబు యాక్టింగ్ కి ఈ సినిమాని చూడొచ్చు అని ప్రేక్షకులు అంటున్నారు. సినిమాలో హీరో హీరోయిన్ల పాత్రలు డైరెక్టర్ చాలా వరకు డిఫరెంట్ గా తీర్చిదిద్దడం తో సినిమా కొద్దిగా ఆసక్తికరంగా ఉంటుంది.

…పాంచజన్య