వరల్డ్ వైడ్ మహేష్ ఫ్యాన్సే అట్టర్ ఫ్లాప్ అని డిసైడ్ చేశారు, కానీ మహేష్ తన సత్తా చాటాడు..!!

వాస్తవం సినిమా:  మహేష్ బాబు కెరీర్లో అతి పెద్ద భారీ బ్లాక్ బస్టర్ సినిమా లో ఒక సినిమా “దూకుడు”. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ రికార్డ్ లు క్రియేట్ చేసింది. ముఖ్యంగా బ్రహ్మానందం సినిమాలో చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమా విజయంతో వెంటనే “ఆగడు” సినిమా శ్రీనువైట్లతో మహేష్ చేయడం జరిగింది. కానీ సినిమా అతి దారుణంగా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది. సినిమా ఎక్కడా ఆగకుండా ఇంటికి వెళ్ళిపోయింది. వరల్డ్ వైడ్ మహేష్ ఫ్యాన్స్ “ఆగడు” అంత అట్టర్ ఫ్లాప్ సినిమా మహేష్ కెరీర్ లో మరొకటి ఉండదని అప్పట్లో తేల్చిపారేశారు. అటువంటి ఈ సినిమా తాజాగా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. పూర్తి విషయంలోకి వెళితే ఈ సినిమా థియేటర్లో ఆడకపోయినా గాని హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో ఏకంగా 500 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకొని సెన్సేషనల్ రికార్డును సాధించింది. హిందీ డబ్బింగ్ లో విడుదల చేయబడ్డ అన్ని వెర్షన్స్ వ్యూస్ కలిపితే ఈ చిత్రానికి 500 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇండియన్ సినిమాలో ఈ మార్క్ అందుకున్న మొదటి సినిమాగా ‘ఆగడు’ నిలిచింది.