కరోనా నుంచి కోలుకొన్న రెజ్లర్ వినేష్ ఫోగాట్

వాస్తవం ప్రతినిధి: కరోనా ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. వారు వీరు అని తేడా లేకుండా అందరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే లక్షలమంది హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు పెరుగుతున్నప్పటికీ కేసులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తుంది.ఇక ఇటీవల భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్ కరోనా బారిన పడ్డారు. 26ఏళ్ళ ఈ రెజ్లర్ తనకి కరోనా సోకిందని స్వయంగా మీడియాకు తెలిపింది.తాజాగా ఆమెకు రాజీవ్ ఖేల్‌రత్నా అవార్డును ప్రకటించింది క్రీడా శాఖ. అయితే కోవిడ్ పాజిటివ్ కారణంగా ఆగస్టు 29న జరిగిన వర్చువల్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డుల వేడుకలో ఆమె పాల్గోనలేకపోయారు. కాగా ప్రస్తుతం ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు నెగిటివ్‌గా వచ్చింది. అయినప్పటికి మరికొన్ని రోజులపాటు క్వరెంటైన్ ఉండనున్నారు. తనకు నెగిటివ్ వచ్చిందని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు.