వాళ్లకి నేనే బిడ్డను అంటున్న పవన్ కళ్యాణ్..!!

వాస్తవం సినిమా: పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు అదేవిధంగా మెగా హీరోలంతా ఒక్కసారిగా కలత చెందారు. చిరంజీవి, రామ్ చరణ్, బన్నీ ఎంతగానో ఈ ఘటన పట్ల బాధపడి, ఆర్థికంగా ఆ కుటుంబాలకు తోడుగా ఉన్నారు. కాగా జరిగిన ఈ ఘటన పట్ల పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ముగ్గురు యువకులు కరెంట్ షాక్ తో మరణించటం దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. అయితే ఆ తల్లిదండ్రుల గర్భ శోకాన్ని అర్ధం చేసుకోగలనని, ఇకపై వారికి నేనే బిడ్డగా నిలుస్తానని అన్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో వాళ్ళ కుటుంబాలకి ఆర్థికంగా అండగా ఉంటానని పవన్ భరోసా ఇచ్చారు. ఈ ఘటనలో గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని స్థానిక నాయకులకు పవన్ ఆదేశించారు.