మరో “గబ్బర్ సింగ్” ని గుర్తు చేస్తున్న హరీష్ శంకర్..!!

వాస్తవం సినిమా: సెప్టెంబర్ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు. చాలా జిల్లాలలో కరోనా వైరస్ బాధితులకు పవన్ అభిమానులు అండగా నిలబడి వారికి పండ్లు, మెడికల్ కిట్లు, మరి కొన్ని హాస్పిటల్స్ లో ఆక్సిజన్ సిలిండర్లు పంచడం జరిగింది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. డైరెక్టర్ హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ చూసి అభిమానులు మరో “గబ్బర్ సింగ్” ని గుర్తు చేస్తున్నవ్ హరీష్ అన్న అంటూ కామెంట్లు పెడుతున్నారు. చాలా వెరైటీ గా పోస్టర్ డిజైన్ వుండటంతో సినిమా పై పవన్ ఫ్యాన్స్ కి హరీష్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఎంతగానో ఆకట్టుకున్నాడు. PSPK 28 అంటూ ఉన్న ఇంగ్లీష్ అక్షరాల మధ్య సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్ బొమ్మలతో కూడి ఈ పోస్టర్ రూపొందించారు. అంతేకాదు, వెరైటీ మోటార్ బైక్ మీద పెదబాలశిక్ష పుస్తకాన్ని ఉంచారు. ఈ సారి కేవలం ఎంటర్ టైన్మెంట్ మాత్రమే కాదు అన్నది పోస్టర్ కింద రాసుకొచ్చారు.