పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు కొత్త సినిమాల ప్రకటనలు..!!

వాస్తవం సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు. మరోపక్క అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుతున్నారు. కొన్ని చోట్ల రక్త దానాలు మరికొన్ని చోట్ల సహాయ సహకార కార్యక్రమాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు ఆయన చేయబోయే కొత్త సినిమాల ప్రకటనలు అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని తెచ్చిపెట్టాయి. విషయంలోకి వెళితే డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది.

ఈ సినిమాని ప్రముఖ నిర్మాత పవన్ స్నేహితుడు రామ్ తాలూరి తన బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇదే రీతిలో క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ సినిమా పుట్టిన రోజు నాడు ఆయన చేయబోయే ప్రాజెక్టులు రిలీజ్ కావడం అభిమానులను ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.