బాధపడిన చిరంజీవి, రామ్ చరణ్, బన్నీ..!!

వాస్తవం సినిమా: పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా మంది బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు, మాస్క్ లు మెడిసిన్ కిట్లు అందిస్తూ సహాయ సహకార కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా చాలా చోట్ల బ్యానర్లు, కటౌట్లు పెట్టి ఎవరికి వారు పవన్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే రీతిలో చిత్తూరు జిల్లా కుప్పం కి చెందిన అభిమానులు బ్యానర్లు, కటౌట్లు కడుతున్న సమయంలో పదిమందికి కరెంట్ షాక్ తగలటంతో ముగ్గురు అభిమానులు మరణించారు. మిగతా వారు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ వార్త తెలుసుకున్న చిరంజీవి, రామ్ చరణ్, బన్నీ చాలా బాధపడ్డారు. ఈ తరుణంలో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు బన్ని అందించారు. అదేరీతిలో పవన్ కళ్యాణ్ కూడా మృతి చెందిన అభిమానుల కుటుంబాలకు ఒకో కుటుంబానికి రెండు లక్షలు అందించారు. అంతేకాకుండా కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రామ్ చరణ్ మరియు చిరంజీవి తీవ్ర మనస్తాపానికి గురై… మీ ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యమని అభిమానులందరూ ఇది గుర్తు పెట్టుకోవాలని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ , వాళ్ళు కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని చరణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ముగ్గురి కుటుంబాలకు 2.5 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.