అదరగొడుతున్న పవన్ కళ్యాణ్ బర్తడే మోషన్ పోస్టర్..!!

వాస్తవం సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ కలిగిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జయాపజయాలతో సంబంధం లేకుండా చెక్కుచెదరని ఫ్యాన్ ఫాలోయింగ్ తో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించిన పవన్ కల్యాణ్ మరోపక్క రాజకీయరంగంలో కూడా అదే రీతిలో రాణిస్తున్నారు. సెప్టెంబర్ రెండవ తారీకు పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న “వకీల్ సాబ్” సినిమాకి సంబంధించి మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. సత్యమేవ జయతే అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఒక చేతిలో పుస్తకాన్ని, మరో చేతిలో కర్ర పట్టుకుని పవన్ కళ్యాణ్ నిల్చున్న విధానం పోస్టర్ అభిమానులకి 100 ఓల్డ్ ఎనర్జీ పవర్ తిరిగి ఇచ్చినట్లు అయ్యింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి రిలీజైన మోషన్ పోస్టర్ కి సోషల్ మీడియాలో మెగా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు.