రేపు, ఎల్లుండి ఇడుపులపాయలో పర్యటించనున్న సీ ఎం జగన్

వాస్తవం ప్రతినిధి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి సొంత జిల్లా కడపలోని ఇడుపులపాయలో పర్యటించనున్నారు. సెప్టెంబర్-02న తన తండ్రిగారైన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొననున్నారు. కాగా ఇందుకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఖరారైందని.. ఇవాళ సాయంత్రంలోపు అధికారికంగా మీడియాకు వెల్లడిస్తారని సమాచారం.