దక్షిణ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..నలుగురు ఉగ్రవాదుల హతం !

వాస్తవం ప్రతినిధి: దక్షిణ కశ్మీర్‌లో ఆర్మీ బుల్లెట్ల వర్షంతో ఉగ్రవాదులపై చెలరేగింది. షోపియాన్ జిల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు. కిలూరా ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో.. నలుగురు ఉగ్రవాదులు చనిపోగా, ఒకరు లొంగిపోయారని, సంయుక్త ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ‘కిలూరా ప్రాంతంలోని ఓ తోటలో 4-5 ఉగ్రవాదులు ఉన్నారని షోపియాన్ పోలీసులకు సమాచారం అందింది. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టగానే ఉగ్రవాదుల్లో ఒకరు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇరు వర్గాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు నేలకొరకగా.. ఒకర్ని ప్రాణాలతో పట్టుకున్నాం. అతణ్ని ప్రశ్నిస్తున్నాం’ అని కశ్మీర్ ఐజీ తెలిపారు.