ఆందోళన అవసరం లేదు..ఇదేనా హామీ.. అంటున్న లక్ష్మణ్

వాస్తవం ప్రతినిధి: కరోనా కారణంగా యూఏఈకి తరలిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ బయో సెక్యూర్ వాతావారణంలో జరుగనుంది. మరో నాలుగు వారాల్లో లీగ్ షురూ కానుంది. అయితే ఈ మెగా లీగ్ తొలిసారి ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా.. ఖాళీ స్టేడియాల్లో జరగనుంది. దాని వల్ల లీగ్ కళ తప్పుతుందేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మునపటి మజా ఉండదని అంటున్నారు. కానీ, ఆందోళన అవసరం లేదని లెజండరీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అంటున్నాడు. ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌ జరిగినంత మాత్రాన క్రికెట్‌ నాణ్యత ఏమాత్రం తగ్గిపోదని ఈ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌ మెంటార్‌ హామీ ఇస్తున్నాడు.

‘నేను అభిమానులందరికీ హామీ ఇస్తున్నా. మైదానంలో ప్రేక్షకులు లేనప్పటికీ క్రికెట్‌ నాణ్యతలో ఎలాంటి మార్పూ ఉండబోదు. ముందులాగే ఈ ఐపీఎల్‌ కూడా మీ అందర్నీ అలరిస్తుందనే నమ్మకముంది’అని లక్ష్మణ్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్ షేర్ చేసిన ఓ వీడియోలో లక్ష్మణ్ పేర్కొన్నాడు.