సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం..17 మంది మృతి

వాస్తవం ప్రతినిధి: సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కార్గో విమానం కుప్పకూలి 17 మంది మరణించారు. మరణించిన వారిలో 15 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఈ విమానం కుప్పకూలింది. వివరాల్లోకి వెళితే… సుడాన్ రాజధాని జూబా సమీపంలో ఉన్న ఎయిర్‌పోర్ట్ నుంచి శనివారం ఉదయం ఈ విమానం బయలుదేరింది. ఈ విమానం స్వచ్చంద సంస్థల కోసం డబ్బు, వాహనాలు, ఆహారం, స్పేర్ పార్ట్‌లను తీసుకెళ్తున్నట్టు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కుర్ కౌల్ తెలిపారు. ఈ కార్గో విమానం సౌత్ వెస్ట్ ఏవియేషన్‌కు చెందినట్టు సమాచారం. విమానం గాల్లోకి వెళ్లిన కాసేపటికే కుప్పకూలినట్టు.. వెంటనే అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్టు అక్కడి మీడియా వెల్లడించింది.