వాస్తవం ప్రతినిధి: పాక్ నుంచి భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పంజాబ్లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఐదుగురిని హతమార్చారు. శనివారం ఉదయం 4.45 గంటల సమయంలో ఇది చోటు చేసుకుంది. ఇంకా ఎవరైనా చొరబాటులు వస్తున్నారేమోనని గాలింపు ముమ్మరం చేశారు. సరిహద్దుల్లో గస్తీ మరింత పెంచారు. కాగా ఓ వైపు భారత్లో ఓ ముష్కరుడి అరెస్టు.. మరోవైపు చొరబాటుదారుల నేపథ్యంలో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి.
తార్న్ తారన్ జిల్లా ఖెమ్కరన్ సరిహద్దు ప్రాంతంలో ఐదుగురు వ్యక్తులు తారసపడ్డారు. ఆయుదాలను ధరించి వస్తున్నవారిని లొంగిపోవాలని జవానులు హెచ్చరించారు.