ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో కీలక విషయం చెప్పిన శ్రవణ్ కుమార్…!!

వాస్తవం ప్రతినిధి: ఏపీ రాజకీయాలలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. విశాఖపట్టణం జిల్లా కి చెందిన న్యాయవాది నిమ్మి గ్రేస్ తో పాటు సీనియర్ న్యాయవాది శ్రవణ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద ఏపీలో ఫోన్ టాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు లో న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదిస్తూ రాష్ట్రంలో ప్రతి జడ్జి కదలికలను ఏపీ ప్రభుత్వం పోలీసులతో పర్యవేక్షిస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ విషయంలో న్యాయవాదులు మాట్లాడుకునే ఫోన్ లా మాటలు…. రికార్డు చేయడానికి ఏపీ ప్రభుత్వం ఒక ఉన్నత పోలీసు అధికారిని నియమించినట్లు, అంతే కాకుండా షాడో పార్టీలను కూడా నియమించారని పిటిషనర్ శ్రవణ్ కోర్టులో వాదించారు. దీంతో న్యాయస్థానం అసలు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉంటే వెంటనే సమర్పించాలని పిటిషనర్ ని ఆదేశించింది. దీంతో అదనపు సమాచారం కోసం అఫిడవిట్ దాఖలు చేస్తామని శ్రవణ్ కోర్టుకు విన్నవించుకున్నారు. ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించడంతో జరిగింది.