సుప్రీం కోర్టులో మూడు రాజధానుల పిటీషన్…విచారణ నుంచి తప్పుకొన్న జడ్జి !

వాస్తవం ప్రతినిధి: ఏపీ రాజధాని వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఎత్తేయాలని ఏపీ సర్కార్ వేసిన పిటిషన్ పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. అయితే విచారణ జరుగుతున్న సమయంలో రైతుల తరఫున హాజరైన సీనియర్ కౌన్సిల్ రజింత్ కుమార్ ప్రధానన్యాయమూర్తి బాబ్డే దృష్టికి ఓ విషయాన్ని తీసుకువచ్చారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రధాన న్యాయమూర్తికి సంబంధించిన బంధువులు రైతుల తరఫున హాజరవుతున్నారని చెప్పారు. దీంతో ఈ కేసు నుంచి తాను తప్పుకుంటున్నానని బాబ్డే అన్నారు. ఈ కేసును వేరే బెంచ్కు లిస్టు చేయాలని రిజిష్ట్రార్ను ఆదేశిస్తూ.. వచ్చే బుధవారానికి వాయిదా వేశారు.