ఢాకా నుంచి స్వదేశానికి చేరిన 167 మంది భారతీయులు

వాస్తవం ప్రతినిధి: ‘వందే భార‌త్ మిష‌న్’ ద్వారా విదేశాల్లో చిక్కుకున్న భార‌త ప్ర‌వాసుల త‌ర‌లింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ‘వందే భార‌త్ మిష‌న్’ ఐదో ద‌శ‌లో భాగంగా ఢాకా నుంచి 167 మంది భార‌తీయులు ఢిల్లీ ప‌య‌న‌మ‌య్యారు. ఈ విమానం గురువారం 167 మంది ప్ర‌యాణికుల‌తో ఢిల్లీకి బ‌య‌ల్దేరింది. కాగా, ఇది ఢాకా నుంచి ఢిల్లీకి వ‌స్తున్న ఏడో రిపాట్రియేష‌న్ విమానం. ఢాకా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు భారతదేశంలోని వివిధ గమ్యస్థానాలకు ఎయిర్ ఇండియా విమానాల ద్వారా 2800 మందిని తరలించిన‌ట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు ఢాకా నుంచి భార‌త్ కు 17 విమానాలు నడిచాయి.