హెచ్-1బీ వీసాదారుల‌కు శుభవార్త చెప్పిన ట్రంప్

వాస్తవం ప్రతినిధి: హెచ్-1బీ వీసాదారుల‌కు ట్రంప్ స‌ర్కార్‌ శుభవార్త చెప్పింది. హెచ్‌1బీ వీసా ఉన్న‌వాళ్లు పాత ఉద్యోగ‌మే కొన‌సాగించేందుకు ట్రంప్ స‌ర్కార్ అనుమ‌తి ఇచ్చింది. వీసా నిషేధానికి ముందు ఎటువంటి ఉద్యోగం చేశారో.. అదే ఉద్యోగంలో కొన‌సాగేందుకు అనుమ‌తి క‌ల్పించారు. ఇక‌ ఈ సడలింపుల ప్రకారం వీసాదారులతో పాటు వారిపై ఆధార‌ప‌డిన‌ జీవితభాగస్వాములు, పిల్లలకు కూడా అనుమతి ఉంటుంద‌ని విదేశాంగ శాఖ పేర్కొంది. ప్ర‌జా ఆరోగ్య‌ లేదా హెల్త్‌కేర్ సిబ్బంది, మెడికల్ రీసెర్చర్ లాంటివారికి కూడా వీసాలు పొందటానికి అవకాశం క‌ల్పిస్తున్న‌ట్టు అమెరికా ప్ర‌భుత్వం తెలిపింది. టెక్నిక‌ల్ స్పెష‌లిస్టులు, సీనియ‌ర్ లెవ‌ల్ మేనేజ‌ర్లు, ఇత‌ర వ‌ర్క‌ర్ల‌కు ఈ స‌డ‌లింపులో అవ‌కాశం క‌ల్పించారు. అమెరికాలో వీసా బ్యాన్ క‌న్నా ముందు ఎటువంటి ఉద్యోగం చేశారో.. అదే ఉద్యోగాన్ని కొన‌సాగించేందుకు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు స్టేట్ డిపార్ట్‌మెంట్ అడ్వైజ‌రీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.