వినాయక చవితి రోజు ఓ శుభవార్త చెబుతానంటున్న నిత్యానంద !

వాస్తవం ప్రతినిధి: కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బ్రతుకుతున్న ఈ కీలక సమయంలో వినాయక చవితి రోజు అందరికీ ఓ శుభవార్త చెబుతా అంటూ కీలక ప్రక టన చేశాడు వివాదాస్పద స్వామీజీ నిత్యానంద. వివరాల ప్రకారం..

అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉండి అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యి ఓ వీడియో విడుదల చేశారు. వినాయక చవితి రోజు మీకు ఓ శుభవార్త చెబుతానని కొన్ని రోజులు మీరు ఆగాలని నిత్యానంద ఆయన భక్తులకు సందేశం ఇచ్చారు. భారత్ నుండి పారిపోయ కైలాసదేశం సృష్టించుకుని ఆ దేశానికి  A to Z నిత్యానంద అయ్యారని ప్రచారం జరిగింది. కొత్త దేశం అయిన కైలాస దేశానికి కొత్త చట్టాలు కొత్త కరెన్సీ నోట్లు కొత్త బ్యాంకులు సృష్టించుకుని వాటి వివరాలను వినాయక చవితి రోజు నిత్యానంద స్వామి విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుంది.