ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన అభిజిత్ ముఖర్జీ

వాస్తవం ప్రతినిధి: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 84 ఏళ్ల వయసులో కరోనా సోకడంతో పాటు బ్రెయిన్ సర్జరీ జరుగగా, ప్రణబ్ ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుండగా, ఆయన పరిస్థితి విషమంగా ఉందన్న సంగతి తెలిసిందే.

అయితే ఆయన మరణించాడన్న వార్త నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. తెలంగాణ బిల్లును ఆమోదించిన రాష్ట్రపతిగా చాలా మంది తెలంగాణ ఏపీ నేతలు కూడా ఆయనకు నివాళులర్పించారు.

స్వయంగా ప్రముఖ జాతీయ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా ముందు వెనుక ఆలోచించకుండా ‘ప్రణబ్ ముఖర్జీ’ చనిపోయాడని ట్వీట్ చేయడంతో నిజమే అనుకొని అందరూ దాన్ని షేర్ చేసి వైరల్ చేశారు.

కాగా ఈ మరణంపై ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ క్లారిటీ ఇచ్చారు.   తన తండ్రి ఆరోగ్యం స్థిరంగా ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

“మీ అందరి ప్రార్థనలతో నా తండ్రి హీమోడైనమికల్లీ స్టేబుల్ గా ఉన్నారు. మీరంతా మీ ప్రార్థనలను కొనసాగించి, ఆయన వేగంగా కోలుకోవాలని కోరుకుంటారని ఆశిస్తున్నాను. కృతజ్ఞతలు” అని అభిజిత్ ట్వీట్ చేశారు.