చైనాలో మరో మహమ్మారి.. విజృంభిస్తున్న బుబోనిక్ ప్లేగు..!!

వాస్తవం ప్రతినిధి: కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అల్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలోనే చైనాలో బుబోనిక్ ప్లేగ్ వ్యాధి విజృంభిస్తోంది. చైనాలోని మంగోలియాలోని ఓ గ్రామంలో ఈ వ్యాధి సోకి ఓ ప్లేగు వ్యాధి ప్రాణాంతకమైనది. శతాబ్దాలుగా అది మనుషులను కబళిస్తూనే ఉంది. పైగా అది అంటువ్యాధి. అందుకే మానవ చరిత్రలో ప్లేగు ఓ ప్రమాదకర వ్యాధిగా మిగిలింది. తాజాగా చనిపోయిన వ్యక్తి పేరు బావుతావ్. గురువారం చనిపోయాడు. ఆ తర్వాత సుజీ జిన్కమ్ గ్రామాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా మార్చి క్లోజ్ చేశారు. గ్రామంలోని వారంతా… టెస్టులు చేయించుకోవాలని ఆదేశించారు.వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఉలిక్కిపడ్డ చైనా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. ఆ ‌గ్రామాన్ని మొత్తం సీల్ చేసింది. ఈ ఘటనపై ఎపిడెమియోలాజికల్ దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉంటే.. ఈ ప్రాంతానికి ఆనుకొని ఉన్న మరో గ్రామంలో ఓ వ్యక్తి అవయవాల వైఫల్యంతో మరణించడంతో గురువారం మొదటి లాక్‌డౌన్ విధించారు. అంతేకాదు ఈ రెండు ప్రాంతాలకు ఈ ఏడాది చివరి వరకు ప్లేగు నిరోధిత హెచ్చరికను జారీ చేశారు.