కరోనా కొత్త అవతారం.. ఇది మహా ప్రమాదకరం..!!

వాస్తవం ప్రతినిధి: ఇప్పటికే ప్రపంచం కరోనాతో విలవిలలాడుతుంటే, మరో కొత్త వ్యాధి ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ముఖ్యంగా ఐదు దేశాల్లో ప్రస్తుతం ఆ వ్యాధి ప్రబలుతున్న ట్లుగా ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీంతో కరోనాతో పాటుగా, ఇప్పుడు మరో వ్యాధి టెన్షన్ ప్రపంచానికి పట్టుకుంది. అమెరికా లాంటి దేశంలో ఏ కొత్త వ్యాధి వచ్చినా వెంటనే తెలిసిపోతుంది. తాజాగా 600 మంది పిల్లలు అరుదైన అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరారు. వాళ్లందరికీ జ్వరం లాంటిది వచ్చింది. ఆ సిండ్రోమ్ రావడానికి కారణం కరోనా వైరస్సే అని డాక్టర్లు తేల్చారు.

అమెరికాలో కరోనాతో పాటుగా మల్టీ సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనే వ్యాధి విజృంభిస్తున్నట్లుగా గుర్తించారు. అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ మరియు చర్యల సంస్థ ముఖ్యంగా పిల్లల్లో మల్టీ సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనే కొత్త వ్యాధి వస్తున్నట్లుగా గుర్తించిన సంస్థ ఈ వ్యాధితో పిల్లల్లో జ్వరం, శరీరంపై దద్దుర్లు, గుండెల్లో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయని, జ్వరం తో మొదలయ్యే ఈ వ్యాధి తరువాత శరీరంలోని మిగతా భాగాలని డామేజ్ చేస్తుందని పేర్కొంది. కరోనా వైరస్ సోకిన 2 నుంచి 4 వారాల తర్వాత పిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అమెరికాలో కరోనా అత్యంత తీవ్రంగా ఉంది కాబట్టి MIS-C కేసులు కూడా పెరగొచ్చని అంటున్నారు.

మే నెలలో MIS-C తొలికేసు బయటపడింది. వెంటనే CDC ఇలాంటి కేసులు ఎక్కడొచ్చినా తనకు రిపోర్ట్ ఇవ్వాలంది. జులై 29 నాటికి 570 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు నమోదైన వాళ్లందరికీ కరోనా వైరస్ సోకింది. వాళ్లలో 10 మంది చనిపోయారు. ఇలాంటి కేసులే అమెరికాతోపాటూ ఫ్రాన్సు, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ లోకూడా నమోదైనట్లు తెలిసింది. ముందుగానే గుర్తిస్తే ఈ కొత్త సిండ్రోమ్ నుంచి పిల్లల్ని కాపాడవచ్చని CDC తెలిపింది. దీనిపై డాక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరింది. దీనివల్ల మరెన్ని దారుణాలు జరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు.