అమెరికాలో మరోసారి గర్జించిన తుపాకీ..!!

వాస్తవం ప్రతినిధి: అగ్రరాజ్యం అమెరికా నిత్యం వార్తలో ఏదో ఒక్క అంశం తో హాట్ టాపిక్ గా ఉంటుంది. ప్రతిరోజు ఓ సెన్సెషన్ వార్తతో వార్తల్లో నిలుస్తుంది. ఒకవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెల్సిందే. ఇలాంటి సమయాల్లో కూడా అమెరికాలో కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. ఎన్నో ఏళ్ళ నుంచీ అమెరికాలో పాతుకు పోయిన గన్ కల్చర్ ని రూపు మాపాలని ప్రయత్నాలు చేస్తునా ఫలితం కనిపించలేదు. అమెరికాలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు.. గన్ కల్చర్ ను విచక్షణా రహితంగా వినియోగిస్తున్న దుండగులు ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతకుంటున్నారు. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి వస్తోంది. బయటకు వెళ్లిన వారు ప్రజలు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటారన్న నమ్మకం లేకుండాపోయింది. అందుకు నిదర్శనం తాజాగా జరిగిన ఈ ఘోరమే.

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో ఒక యువకుడు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. క్రిస్టోఫర్ బ్రౌన్ అనే 17 ఏళ్లు యువకుడిగా గుర్తించారు. ఈ కాల్పుల్లో మరో 19మంది తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి 12.20 గంటల సమయంలో గుమిగూడి ఉన్న వారి మీద ఎవరో గుర్తుతెలియని దుండగుడు పలుమార్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు.ఇక ఓ పోలీస్ అధికారి కూడా ఈ కాల్పుల్లో గాయపడింది. ఆమె పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక మిగిలిన వారికి ప్రాణనష్టం వాటిల్లేలా బులెట్స్ తగలలేదు. ఫుడ్ మ్యూజిక్ పెట్టుకొని కొందరు గుమిగూడి ఉన్నప్పుడు ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు చెప్పారు. సామూహిక వేడుకపై ఈ కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపింది ఎవరనేది తెలియాల్సి ఉంది.