అంగరంగ వైభవంగా చిరంజీవి బర్త్ డే వేడుకలు..!!

వాస్తవం సినిమా: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఈ నెల 22వ తారీకు సందర్భంగా గ్రాండ్ గా మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది 65వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న తరుణంలో మెగా అభిమానులు సోషల్ మీడియాలో ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. 65వ వసంతంలోకి చిరంజీవి అడుగు పెట్టబోతున్న తరుణంలో … ఓ కామన్ డిపీ క్రియేట్ చేశారట. నేనే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరుగాంచిన 65 మంది ప్రముఖ సెలబ్రిటీల చేత రిలీజ్ చేయించే ఆలోచనలో ప్లాన్ చేస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చిన నాటి నుండి కెరియర్ లో అందుకున్న అవార్డులు మరియు సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాల ఫోటోలు అంతా కలిపి ఓ డిపీ చేయటానికి పనులు ప్రారంభించారు. మరోపక్క తన పుట్టిన రోజునాడు మెగా అభిమానులకు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న “ఆచార్య” సినిమాకి సంబంధించి చిన్న వీడియో రిలీజ్ చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వాలని చిరంజీవి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.