మహేష్ బర్తడే నాడు వైరల్ పోస్ట్ పెట్టిన నమ్రత..!!

వాస్తవం సినిమా: సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు బర్తడే విషెస్ తో సరికొత్త హ్యాష్ ట్యాగ్ తో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ఇదే టైమ్ లో మహేష్ కొత్త సినిమా “సర్కారు వారి పాట” సినిమాకి సంబంధించి ప్రి లుక్ పోస్టర్ సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ఎస్.ఎస్.తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చిన ఒక మ్యూజిక్ ట్రాక్ ను మోషన్ పోస్టర్ ద్వారా విడుదల చేశారు. అయితే ఇందులో మహేష్ ముఖం పూర్తిగా కనిపించలేదు. ఇక విడుదల చేసిన మోషన్ పోస్టర్ లో ఒక రూపాయి బిళ్ళ ను మహేష్ బాబు ఎగరేస్తున్నట్లు అతని చేతిని మాత్రమే చూపించారు. మహేష్ ముఖం కనిపించకపోవటంతో అభిమానులు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు.

ఇదిలా ఉండగా పుట్టినరోజు సందర్భంగా మహేష్ భార్య నమ్రత ఇంస్టాగ్రామ్ లో సంచలన పోస్ట్ పెట్టింది. ”నిజమైన ప్రేమ అంటే ఏంటి అనేది నేను నీతోనే అనుభవించాను. పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్, ఇప్పుడు మరియు ఎల్లప్పుడూ నేను నిన్ను ప్రేమిస్తుంటాను” అని తెలుపుతూ మహేష్ తనకు ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేసింది. మహేష్ బాబు 46వ పుట్టినరోజు సందర్భంగా ఇంకా చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో విశేష తెలియజేస్తున్నారు.