2000 నోటు పై కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ..!!

వాస్తవం ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం పాత నోట్లు రద్దు అనంతరం 10 నుంచి 2 వేల నోట్ల వరకు కొత్త నోట్లను అప్పట్లో చలామణీ లోకి తీసుకు వచ్చింది. కేంద్రం కొత్తగా తెచ్చినవి 200, 2000 నోట్ల లో ఒకటి కనుమరుగవడం గ్యారెంటీ అనే వార్తలు ఇటీవల వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే రాబోయే రోజుల్లో రెండు వేల నోటు కనబడదు అన్న టాక్ గట్టిగా వినబడుతోంది. ఆర్థిక వ్యవస్థ లో 2000 నోట్లు తగినంత ఉందని గతంలో కేంద్ర ప్రభుత్వం వాటి ముద్రణ ఆపేసిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే ఇటీవల 500 నోట్ల ముద్రణ గణనీయంగా పెరగడం జరిగింది. కాగా దేశంలోని నల్లధనాన్ని అరికట్టడం కోసం త్వరలో 2 వేల నోట్ల ముద్రణ గణనీయంగా తగ్గించడానికి రెడీ అయినట్లు ఆర్బిఐ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఇప్పటివరకు చలామణి అవుతున్న 2000 నోట్లు చెల్లుతాయి. వాటిపై ఎలాంటి బ్యాన్ వుండదు. కానీ రాబోయే రోజుల్లో మరింత తగ్గించి, 500 నోట్లు చలామణి ఎక్కువ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బిఐ స్పష్టం చేసింది.