మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్!

వాస్తవం ప్రతినిధి: దేశంలో క‌రోనా ఉగ్ర‌రూపం దాలుస్తోంది. ఇప్ప‌టికే రోజుకు 60 వేల‌కు పైగా కేసుల‌తో ప్ర‌మాద‌క‌ర‌స్థాయిని దాట‌గా.. ప్ర‌ముఖులు ఈ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో ఆయ‌న ఆస్ప‌త్రిలో చేరారు.