ఏపీ సీఎం జగన్ మీద సీరియస్ అయిన మోడీ..??

వాస్తవం ప్రతినిధి: కరోనా కష్టకాలంలో వరుసగా ఏపీలో దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల విజయవాడ కరోనా హాస్పిటల్ గా ఉన్న స్వర్ణ ప్యాలెస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో హాస్పిటల్ లో ఉన్న 50 మంది కరోనా రోగులలో 11 మంది చనిపోవడం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆదివారం తెల్లవారుజామున చెలరేగిన మంటలు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారటంతో.. ఫైర్ సిబ్బంది ద్వారా కొంత మందిని కాపాడటం జరిగింది. హోటల్ సిబ్బంది అప్రమత్తతతో చాలావరకు ప్రాణనష్టం తగ్గటం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ వార్త వైరల్ కావడంతో ప్రధాని మోడీ వైఎస్ జగన్ కి ఫోన్ చేసి ప్రమాదానికి జరిగిన కారణాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అయితే వరుస గా ప్రమాద ఘటనలు ఏపీలో చోటుచేసుకోవడంతో జగన్ మీద మోడీ సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంలో చనిపోయిన ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించడం జరిగింది. విపక్షాల నుండి అదే రీతిలో సామాన్య జనుల నుండి కూడా ఈ ఘటన వలన ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.

.