మళ్లీ మోడీ యే అంటున్న దేశ ప్రజలు..!!

వాస్తవం ప్రతినిధి: మళ్లీ భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ నే కోరుకుంటున్నట్లు ఇటీవల జాతీయ మీడియా ఇండియాటుడే నిర్వహించిన “మూడ్ ఆఫ్ ది నేషన్” సర్వేలో బయటపడింది. దాదాపు 66 శాతం మంది ప్రజలు మళ్లీ ప్రధాని మోడీ అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు. దీన్నిబట్టి మోడీ పై దేశ ప్రజలకు విశ్వాసం ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువైంది. జూలై 15 నుండి 27 వరకు దాదాపు 12వేల 21 మంది వద్ద తీసుకున్న అభిప్రాయాలను టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా సేకరించి ఇండియా టుడే “మూడ్ ఆఫ్ ది నేషన్” ఈ ఫలితాలను వెల్లడించింది. నెక్స్ట్ ప్రధాని ఎవరు అనే ఈ సర్వేలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కి ఎనిమిది శాతం, సోనియాగాంధీకి ఐదు శాతం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కి నాలుగు శాతం, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మూడు శాతం, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా మూడు శాతం, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2శాతం, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ 2% ఇంకా మిగతా నాయకులంతా ఒక శాతం ఓట్లను రాబట్టారు.