జూనియర్ ఎన్టీఆర్ కూడా కాపాడలేడు అంటున్న కొడాలి నాని..!!

వాస్తవం ప్రతినిధి: ఏపీ మంత్రి కొడాలి నాని ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ పార్టీపై మరియు చంద్రబాబుపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. నందమూరి హరికృష్ణ ఫ్యామిలీ తో అత్యంత సన్నిహితంగా ఉండే కొడాలి నాని…. జూనియర్ ఎన్టీఆర్ తో మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో కొడాలి నాని మాట్లాడుతూ…. టిడిపి పార్టీలో ఉన్న సమయంలో నందమూరి హరికృష్ణ, నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ తో ఎక్కువ ట్రావెల్ అయినట్లు తెలిపారు. అయితే 2009 ఎన్నికలలో టిడిపి ఓడిపోయిన తర్వాత హరికృష్ణను మరియు జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని వదిలెయ్యటం తనకు బాధ కలిగించిందని, అప్పుడే డిసైడ్ అయ్యాను టిడిపిలో మనుగడ కష్టమని తెలిపారు. ముఖ్యంగా చంద్రబాబు మొదట అన్న నందమూరి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడవటం, హరికృష్ణ ఫ్యామిలీ ని పక్కన పెట్టడం, వైయస్ చనిపోయిన తర్వాత జగన్ ని కాంగ్రెస్ పార్టీతో కలిసి ఇబ్బందులకు గురి చేయడం తనకు నచ్చక టిడిపి పార్టీ నుండి బయటకు వచ్చి వైసీపీలో చేరినటు క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం టిడిపి పార్టీ పరిస్థితి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగిన కాపాడే సీన్ లేదని కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కి కరోనా భయం పట్టుకుందని, అందుకే నాలుగు గోడలకి పరిమితమయి జూమ్ మీటింగులు పెట్టుకుంటున్నారని నాని తనదైన శైలిలో కామెంట్లు చేశారు.