ప్లాస్మా దానం చేయడానికి ముందుకొచ్చిన మధ్యప్రదేశ్ సీఎం..!!

వాస్తవం ప్రతినిధి: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గతనెల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. జులై 25 వ తారీఖున ఆయనకి కరోనా పాజిటివ్ అని తేలడంతో వెంటనే ఆసుపత్రిలో చేరిన శివరాజ్ చౌహాన్ సింగ్ తనతో రెండు వారాలుగా కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని హోమ్ క్వారంటైన్ కి వెళ్లిపోవాలని సూచించారు. అయితే తాజాగా ఆయన 11 రోజుల అనంతరం మరణాన్ని జయించి ఆగస్టు 5వ తారీఖున హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత హోమ్ క్వారంటైన్ లో ఉన్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. నేను కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నాను. నా శరీరంలో యాంటీబాడీలు కరోనాతో పోరాడాయి. నేను త్వరలో ప్లాస్మాను కరోనా రోగులకు డొనేట్ చేయడానికి ముందుకు వస్తున్నట్లు ప్రకటన చేశారు. ట్విట్టర్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. దీంతో ప్లాస్మా డొనేట్ చేయటం కోసం దేశంలో ఒక ముఖ్యమంత్రి ముందుకు రావడం, ఇదే ప్రథమం కావడంతో సోషల్ మీడియాలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.