ఆగస్టు 11 నుండి రంగంలోకి దిగుతున్న సోము వీర్రాజు..!!

వాస్తవం ప్రతినిధి: ఏపీ బిజెపి పార్టీ కొత్త అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు ఈ నెల 11 వ తారీకు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడ నగరంలో ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్ లో ఈ కార్యక్రమం జరగనుందని ఆ పార్టీ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు రామరాజు సత్యమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రామ్ మాధవ్ వస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అదే రీతిలో ఆయనతోపాటు అఖిల భారత సంఘటన్ సహాయ కార్యదర్శి సతీష్ జీ రాబోతున్నట్లు, ఇంకా రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇన్ చార్జి సునీల్ థియేడర్ మరియు రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సోము వీర్రాజు అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించే రీతిలో కార్యక్రమాలు చురుగ్గా జరిగేలా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.