కరోనా వ్యాక్సిన్ గురించి ఆందోళన కలిగించే విషయం..!!

వాస్తవం ప్రతినిధి: ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆశగా ఎదురుచూస్తుంది దేనికోసమో అందరికి తెలుసు. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ గురించి. ప్రపంచ దేశాలు ఒక్ ఛాలేంజ్ గా తీసుకుని ఈ కరోనా కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పోటాఫోటిగా పనిచేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వ్యాక్సిన్ గురించి ఓ ఆందోళన కలిగించే విషయాన్ని బయటపెట్టారు యూఎస్‌ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ. బ్రౌన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన వెబ్‌నార్‌లో ఆయన మాత్లాడుతూ.. “టీకా సమర్థత ఏమిటో మాకు ఇంకా తెలియదు. ఇది 50% లేదా 60% పనిచేస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం. ఇది 75% కంటే ఎక్కువ పనిచేయాలని కోరుకుంటున్నాం.’ అని ఫౌసీ చెప్పారు. ఏది ఏమైనా మాస్కులు ధరించడం, శానిటైజర్‌ వాడడం, సామాజిక దూరాన్ని పాటించడంలాంటివి కొనసాగించాలని సూచించారు. కొవిడ్‌ టీకా వచ్చినా అది 50-60% మాత్రమే ప్రభావవంతంగా ఉంటుందని, ఈ మహమ్మారిని అదుపులో ఉంచేందుకు ఇంకా ప్రజారోగ్య చర్యలు అవసరమవుతాయని స్పష్టం చేశారు.