‘వందే భారత్ మిషన్‌’ పై పుకార్లకు చెక్.. క్లారిటి ఇచ్చిన కేంద్రం..!!

వాస్తవం ప్రతినిధి: ‘వందే భారత్ మిషన్‌’లో భాగంగా దుబాయిలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తున్న ఎయిర్ ఇండియా విమానం కేరళలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ మిషన్‌ను కొనసాగిస్తుందో.. లేదో.. అని విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. ‘వందే భారత్ మిషన్’ కొనసాగింపుపై భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ‘వందే భారత్ మిషన్’ను యథావిధిగా కొనసాగించనున్నట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది.