మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ !

వాస్తవం ప్రతినిధి: ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైరస్ సోకగా..తాజాగా కేంద్రమంత్రులకు సైతం ఈ వైరస్ సోకింది. ఇటీవల కరోనా నివారణకు అప్పడాలు బాగా పనిచేస్తాయని.. వాటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వ్యాఖ్యానించిన కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్, ‘భా బీజీ అప్పడాలు’ అంటూ వాటికి ప్రమోషన్ కల్పిస్తున్నట్టు చేతిలో పట్టుకొని పబ్లిసిటీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఆయన అదే కరోనా బారినపడ్డారు. దీంతో ఆయనను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.

రెండుసార్లు కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్ కరోనా టెస్టు చేయించుకోగా.. రెండోసారి ఆయనకు పాజిటివ్ గా తేలింది. దీంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కేంద్రమంత్రి అర్జున్ చేరారు.

తనకు కరోనా సోకిందని.. తనతో కాంటాక్ట్ లో ఉన్నవారంతా టెస్ట్ చేయించుకోవాలని అర్జున్ రామ్ మేఘ్ కోరారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. తన సన్నిహితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.