బీజేపీ భారీ స్కెచ్…టీడీపీ ఖాళీయేనా..చిరు కి కీలక భాద్యతలు..??

వాస్తవం ప్రతినిధి: ఏపీ లో భవిష్యత్తు రాజకీయాల్లో కీలక మార్పులు రానున్నాయా..?? తెలుగుదేశం పార్టీ ని దెబ్బ కొట్టేందుకు, 2024 ఎన్నికల్లో వైసీపీ ని మట్టికరిపించి బీజీపీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయా..?? అందుకు బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోందా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ఏపీ బీజేపీ లో తాజాగా జరుగుతున్న మార్పులే అందుకు నిదర్శనమని అంటున్నారు. టీడీపీ, వైసీపీ పార్టీలకి వారి వారి సామాజిక వర్గాల మద్దతు ఎంతో బలంగా ఉన్న నేపధ్యంలో బీజేపీ సైతం తన రూటు మార్చుకోక తప్పడంలేదనేది తాజా పరిణామాలబట్టి తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎన్నిక కావడం అదే సమయంలో సోము ఊహించని విధంగా మెగాస్టార్ చిరంజీవిని కలవడం పై తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది..

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎన్నికైన తరువాత మీడియాతో మాట్లాడుతూ 2024 లో బీజీపీ అధికారంలోకి రావడం ఖాయమని అందుకు వ్యూహాలతో సిద్దంగా ఉన్నామని సోము ప్రకటించడం వెనువెంటనే మెగాస్టార్ చిరంజీవిని వెళ్లి కలవడం కూడా చర్చనీయాంశం గా మారింది. ఇదిలాఉంటే సోము వీర్రాజు జనసేన అధినేతని కలవక ముందే చిరంజీవిని కలవడం వెనుక భారీ వ్యుహరచన ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలోనే కొన్ని ఊహాగానాలు కూడా రాజకీయవర్గాలలో చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే

ఏపీలో సామాజిక వర్గాల ఆధారంగానే రాజకీయ ఆధిపత్యం కలుగుతుందని గ్రహించిన బీజేపీ అందుకుతగ్గ వ్యుహాలని పన్నుతోందని అందులో భాగంగానే ఏపీలో మూడవ బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులను ఏకతాటిపైకి తీసుకువస్తే తప్పకుండా విజయం సాధించవచ్చని భావిస్తోందని అందుకే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కన్నా కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేత అయినా కూడా పార్టీని కాపులకు కాపు కీలక నేతలకి దగ్గర చేయడంలో విఫలమయ్యారని అధిష్టానం భావించి సోము వీర్రాజుకి కీలక భాద్యతలు అప్పగించిందని అంటున్నారు.

సోము వీర్రాజుకి ఈ కీలక బాధ్యతలు అప్పగించడంతో పాటు ఏపీలో కీలకమైన కాపు నేతలని ఒకే తాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలని ముమ్మరం చేయనున్నారట. ఈ క్రమంలోనే చిరంజీవితో సోము వీర్రాజు భేటీ అయ్యారని వినికిడి. ముందుగా చిరు ద్వారా పలువురు కాపు కీలక నేతలను అలాగే టీడీపీలో ఉన్న బలమైన కాపు నేతలని సైతం బీజేపీలో చేర్పించి టీడీపీని ఖాళీ చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పట్లో వైసీపీ ని ఎదుర్కునే పరిస్థితులు లేవు కాబట్టి ముందుగా టీడీపీలో పలువురు నేతలని తమ పార్టీ వైపుకి ఆకర్షించేకునేలా చేసి ఆ తరువాత వైసీపీలో ఉన్న అసంతృప్త నేతలకి గేలం వేసేలా ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టనున్నారట. ఇప్పటికే టీడీపీలో పలువురు కీలక నేతలు బీజేపీ తో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. భవిష్యత్తులో బీజేపీ జనసేన తో కలిసి ప్రభుత్వం ఏర్పడేలా వ్యూహాలు రచిస్తున్నారట.ఒక వేళ ప్రభుత్వం ఏర్పాటు అయినా ,కాకపోయినా చిరజీవికి మాత్రం కేంద్రంలో కీలక పదవి కట్టబెడుతారని అంటున్నారు విశ్లేషకులు..