ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే: చిరంజీవి  

వాస్తవం ప్రతినిధి:   విజయవాడలోని ఓ కొవిడ్ కేర్ సెంటర్ (హోటల్ స్వర్ణ ప్యాలెస్)లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా పరిగణించాలని తెలిపారు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన చిరంజీవి, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

విజయవాడలో కరోనా కేసుల ఉద్ధృతి కారణంగా కొన్ని హోటళ్లను కూడా కరోనా కేర్ కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. రమేష్ ఆసుపత్రి హోటల్ స్వర్ణ ప్యాలెస్ ను కరోనా కేర్ సెంటర్ గా ఉపయోగిస్తోంది. అయితే ఈ ఉదయం షార్ట్ సర్క్యూట్ తో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది మృత్యువాత పడ్డారు