కరోనా కాటుకు బలైన మరో ఎన్నారై..!!

వాస్తవం ప్రతినిధి: దేశం కాని దేశంలో మ‌హమ్మారి క‌రోనా కాటు కు చాలా మంది ప్రవాసులు బల్లైయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా క‌రోనాతో బ‌హ్రెయిన్‌లో మ‌రో భార‌త వ్య‌క్తి మృతి చెందాడు. కేర‌ళ రాష్ట్రం అల‌ప్పుజా హ‌రిప‌ద్ క‌రిచ‌ల్‌కు చెందిన అజీంద్ర‌న్‌(53) ప‌దేళ్లుగా బ‌హ్రెయిన్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే, ఇటీవ‌ల కోవిడ్ బారిన ప‌డ్డారు. దీంతో‌ అజీంద్ర‌న్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ.. కరోనాతో చివరి వరకు పోరాడి చ‌నిపోయాడు. అత‌నికి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా ఉండ‌డంతో కోలుకోలేక‌పోయాడ‌ని అధికారులు పేర్కొన్నారు. ఆయన మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.