జగన్ ఎందుకు ఇంతగా జేసీ ఫ్యామిలీ మీద పగబట్టాడు ?

వాస్తవం ప్రతినిధి: అనంతపురం జిల్లా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ అక్రమ రిజిస్ట్రేషన్ వాహన కేసు విషయంలో అరెస్ట్ అవటం తెలిసిందే. ఈ కేసు విషయంలో అనేక సార్లు బెయిల్ కోసం అప్లై చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డికి తాజాగా న్యాయస్థానం మంజూరు చేయటంతో కడప జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకోకముందే జేసీ ప్రభాకర్ రెడ్డి పై మరో కేసు నమోదయ్యింది. దీంతో అరెస్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కరోనా కారణంగా నిబంధనలను ఉల్లంఘించి భారీ ర్యాలీగా వెళ్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవటంతో ఇదే సమయంలో పోలీసులపై ప్రభాకర్ రెడ్డి విరుచుకు పడటంతో పాటు వాళ్ళ విధి నిర్వహణలో అడ్డుపడటంతో సెక్షన్ 353 తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే ఈ విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు కావడంతో సీఎం జగన్ కావాలని ఆయన టార్గెట్ చేసినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.

చంద్రబాబు హయాంలో జేసీ బ్రదర్స్ జగన్ ని మీడియా ముందే బండ బూతులు తిట్టడం తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా పరుష పదజాలంతో విమర్శలు చేయడంతో ఆయన్ని టార్గెట్ చేసినట్లు చాలామంది చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ చనిపోయాక వైఎస్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా రాయలసీమలో జేసీ బ్రదర్స్ వ్యవహరించడంతో, జగన్ అధికారంలోకి రావడం తోనే జేసీ ఫ్యామిలీని గట్టిగా టార్గెట్ చేశారని సీనియర్ నేతలు భావిస్తున్నారు.