ప‌రుచూరి కుటుంబంలో విషాదం..!!

వాస్తవం ప్రతినిధి: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ టాలీవుడ్ ర‌చ‌యిత ప‌రుచూరి వెంకటేశ్వరరావు స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి(74) కన్నుమూశారు. శుక్ర‌వారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆరోగ్య ప‌రిస్థితి విషమించ‌డంతో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో మృతి చెందారు. విజయలక్ష్మి మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ తమ సంతాపాన్ని తెలియ‌జేస్తున్నారు.